స్వస్తిక్ న్యూస్, వినుకొండ :- మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలకు భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతున్నారు. ఇక శివరాత్రి పర్వదినాన ఆయా శివ క్షేత్రాలలో చాలా ఘనంగా తిరునాళ్ళు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం, కోటప్పకొండ, త్రిపురాంతకం వంటి శివ క్షేత్రాలలో భారీ స్థాయిలో ఈ మహాశివరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే తాజాగా వినుకొండ ఆర్టీసీ డిపో అధికారులు ఆయా క్షేత్రాలకు గాను ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధిక సంఖ్యలో బస్సులను నడపనున్నారు.
వినుకొండ బస్టాండ్ :- కోటప్పకొండ- శ్రీశైలం-త్రిపురాంతకం- మన్నేపల్లి తండా
వినుకొండ ⇒ కోటప్పకొండ 50 బస్సులు

వినుకొండ ⇒ శ్రీశైలం 10 బస్సులు

వినుకొండ ⇒ త్రిపురాంతకం 6 బస్సులు

వినకొండ ⇒ మన్నేపల్లి తండా 4 బస్సులు

కాబట్టి శ్రీశైలం,కోటప్పకొండ, త్రిపురాంతకం, మన్నేపల్లి తండాకు సంబంధించిన తిరుణాళ్లకు వెళ్లాలనుకునే భక్తులు వినుకొండ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులలో సులభంగా వెళ్లవచ్చు. శైవ క్షేత్రాలకు వెళ్లేటువంటి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని వీలైతే మీ కుటుంబ సభ్యులకు లేదా ఫ్రెండ్స్ కు ఈ విషయాన్నీ షేర్ చేయాలని మనవి.
"ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు"