స్వస్తిక్ న్యూస్, పుల్లల చెరువు :- మహాశివరాత్రి సందర్బంగా మార్కాపురం ప్రజలకు పుల్లలచెరువు మండలం, మల్లాపాలెం వాసి, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సంస్థల ముఖ్య సలహాదారులు డాక్టర్ ఆవుల నాసరరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైన పవిత్ర భూమి మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోందని వివరించారు. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని చెప్పారు. పరమశివుని అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO :-
https://swasthiknews.com/news/complete-history-of-tripurantaka-kshetra-