TOLLYWOOD :- టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరికొత్త మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ మూవీకి "డేవిడ్ రెడ్డి" అనే సరికొత్త టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మంచు మనోజ్ లుక్స్ ను చూసి తన ఫ్యాన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సినిమా అభిమానులను భయానికి గురిచేస్తుంది. తన సినిమా చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి మంచు మనోజ్ భయంకరమైన లుక్ లో ప్రేక్షకులకు దర్శనమిచ్చారు. డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూనే .. అంతటితో ఆగకుండా "నాలోని సరికొత్త కోణం అంటూ.. ఇది క్రూరమైనది, క్షమించలేనిది" అంటూ రాసుకురావడం ప్రతి ఒక్కరిని కూడా సినిమాపై హైప్స్ ని పెంచుతున్నాయి.

గతంలో మంచు మనోజ్ అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేశారు.. కానీ ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం,కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది అని చిత్ర బృందం ఇంతకుముందే ప్రకటించింది. ఏది ఏమైనప్పాటికి ఇటువంటి లుక్స్ లో గతంలో ఏ సినిమాలో కూడా మంచు మనోజ్ కనిపించలేదు. ప్రేక్షకులను అలరించడానికి ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో మాత్రమే కాకుండా తన లుక్ ను కూడా మార్చుకుని మరీ సినిమా తీస్తున్నారు అంటే కచ్చితంగా ఏదో ఒక తెలియని విషయాన్ని చెప్పబోతున్నారు అంటూ సినీ వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది.