స్వస్తిక్ న్యూస్,హైదరాబాద్ :- రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ విభాగాల్లో మొత్తం 7,437 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా సమాచారం. వీటిని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి :-
పోలీస్ శాఖ:సివిల్ ఎస్ఐ (SI): 148
రిజర్వ్ ఎస్ఐ (AR): 14
రిజర్వ్ ఎస్ఐ (TGSP): 12
రిజర్వ్ ఎస్ఐ (SARCPL): 3
ఏఎస్ఐ (FPB): 23
సివిల్ కానిస్టేబుల్: 3,697
ఏఆర్ (AR) కానిస్టేబుల్: 1,052
SARCPL కానిస్టేబుల్: 24
కానిస్టేబుల్ (డ్రైవర్) PTO: 20
మెకానిక్: 7
ఫైర్ శాఖ (అగ్నిమాపక శాఖ):స్టేషన్ ఆఫీసర్: 39
ఫైర్ ఫైటర్: 751
జైళ్ల శాఖ:డిప్యూటీ జైలర్ (మెన్): 14
డిప్యూటీ జైలర్ (ఉమెన్): 1
వార్డెన్ (మేల్): 196
వార్డెన్ (ఫిమేల్): 12
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):ఎస్ఐ (SI): 44
కానిస్టేబుల్: 1,380
ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన (నోటిఫికేషన్) ఎప్పుడు వెలువడుతుందనే దానిపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ నియామక ప్రక్రియ రాష్ట్రంలోని యువతకు ఒక గొప్ప అవకాశం. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేయడం మంచిది.