స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్:- ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కేవలం సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద పెద్ద అధికారులే ఈ సోషల్ మీడియాకు బలైపోయారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న పిల్లల సైతం సోషల్ మీడియాకు బాగా అలవాటు పడుతున్న కారణంగా వారు కూడా చెడిపోయే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే పలు దేశాలలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించారు.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇదే ఆలోచనలపై అడుగులు వేస్తోంది. పిల్లలకు సోషల్ మీడియా నుంచి రక్షణ కల్పించేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా మంత్రులు, కార్యదర్శులు,శాంతిభద్రతలపై డిజిపి మరియు ఎస్పీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పదహారేళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడుకను తగ్గించేందుకు పక్క ప్రణాళికలు రూపొందిస్తున్నాము అని తెలిపారు.అలాగే ఈ మధ్యకాలంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాము అని ఇకపై మద్యం మరియు డ్రగ్స్ కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు.
