స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :- ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతానికి పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మేడికొండ రామారావు తనవంతు సహకారం అందిస్తున్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగా విద్యార్థులకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఆ సమయంలో విద్యార్థులు అలసటకు లోనుకాకుండా, చదువుపై పూర్తి ఏకాగ్రతతో ఉండాలంటే పౌష్టికాహారం అవసరమని తనవంతు సహకారం తో పిల్లలకు స్నాక్స్అందించారు. పది రోజుల పాటు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తానని ఈ సందర్బంగా మేడికొండ రామారావు తెలిజేశారు.
