స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :-యర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఈరోజు ఘనంగా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని మెగా జాబ్ మేళాలను ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించేలా ముందడుగు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఇలాంటి చక్కని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (DSDO) కంచిబాబు, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ విజయకుమారి, వివిధ ప్రముఖ కంపెనీల హెచ్.ఆర్ (HR) ప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన లభించింది.