Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

MI-RR మ్యాచ్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

07 Apr 2026
09:50 PM
47

స్వస్తిక్ న్యూస్,MI-RR మ్యాచ్..

గువహటి:- క్రికెట్ అభిమానులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గువహటి వేదికగా ముంబై ఇండియన్స్ (MI) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అడ్డంకిగా మారిన వర్షం ఎట్టకేలకు తగ్గింది. దీంతో మైదాన సిబ్బంది హుటాహుటిన పిచ్‌పై ఉన్న కవర్లను తొలగించి, అవుట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టే పనుల్లో నిమగ్నమయ్యారు.

మ్యాచ్ అప్‌డేట్స్:-టాస్ సమయం: రాత్రి 9.55 గంటలకు టాస్ వేయనున్నారు.

మ్యాచ్ ప్రారంభం:-రాత్రి 10.10 గంటలకు ఆట మొదలవుతుంది.

ఓవర్ల కుదింపు:- వర్షం కారణంగా సమయం వృథా కావడంతో, మ్యాచ్‌ను ఇరు జట్లకు తలో 11 ఓవర్లకు కుదించారు.​వర్షం పడుతున్నప్పటికీ స్టేడియంలోనే వేచి చూస్తున్న అభిమానులు, మ్యాచ్ ప్రారంభం కానుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఓవర్ల మ్యాచ్ కావడంతో పరుగుల వర్షం కురుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates