Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

పాలుట్ల గిరిజన గూడెంలో 2.86 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన మంత్రి గొట్టిపాటి

07 Feb 2026
08:51 AM
110

స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం:- ర్రగొండపాలెం మండలం,నల్లమల అటవీప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నివాసముంటున్న గిరిజన ప్రజలకు అవసరార్ధం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్  సహకారంతో 2.86 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని 611 గిరిజన కుటుంబాలకు వెలుగును కల్పించారు.

Article Image

 ఈ సందర్బంగా స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ , కలెక్టర్ రాజబాబు , ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి , టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు  పాల్గొని కరెంట్ సౌకర్యాన్ని ప్రారంభించారు. గిరిజనులు తమ నృత్యాలతో, పూల వర్షంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి ఘన స్వాగతం పలికారు.

Article Image

తమకోసం సోలార్ విద్యుత్ అందించడమే కాకుండా స్వయంగా 50 కిలోమీటర్ల అడవి మార్గంలో ప్రయాణించి సోలార్ విద్యుత్ ప్రారంభించినందుకు గిరిజన ప్రజలు ధన్యవాదములు తెలిపారు. అనంతరం గిరిజన ప్రజల తోటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటుగా ఎమ్మెల్యే, ఇన్చార్జి మరియు అధికారులు భోజనం చేశారు.

Article Image

ఈ కార్యక్రమంలో మార్కాపురం RDO , ITDA PO, ఎలక్ట్రికల్ SE , అధికారులు, కూటమి నాయకులు, గూడెం ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!