స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్. ఏపీ టెన్త్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా ఈ రిజల్ట్స్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు.ఫలితాల విడుదలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు, కసరత్తు పూర్తి చేసినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభమై, ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగాయి. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాశారు.