స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయ:- అరేబియా సముద్రం వేదికగా భారత్ మరియు పాకిస్థాన్ దేశాలు వరుస క్షిపణి పరీక్షలకు సిద్ధమయ్యాయి. రెండు దేశాలు పోటాపోటీగా తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవడంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
ముఖ్య విశేషాలు:-పాకిస్థాన్ షెడ్యూల్: ఏప్రిల్ 20 తెల్లవారుజామున 3 గంటల నుండి ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.భారత్ షెడ్యూల్పాక్ ప్రయోగాల వెనువెంటనే ఏప్రిల్ 22 ఉదయం 9:30 గంటల నుండి ఏప్రిల్ 25 రాత్రి 9:30 గంటల వరకు భారత్ తన పరీక్షలను నిర్వహించనుంది.నోటమ్ (NOTAM) జారీ ఈ క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఇరు దేశాలు ఇప్పటికే 'నోటీస్ టు ఎయిర్‌మెన్' (NOTAM) విడుదల చేశాయి. విమానయాన భద్రత దృష్ట్యా నిర్దేశిత సమయాల్లో ఆయా మార్గాల్లో విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు.