స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :- యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి యర్రగొండపాలెం శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సరదాగా టీ తాగుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా ప్రజల్లో తిరుగుతూ సమస్యలపై ఆరా తీస్తూ ప్రజలలో ఒక వ్యక్తిగా మారారు. నిత్యం క్యాడర్ తో కనెక్ట్ అవుతూ , తనదైన శైళిలో కంటైన్ట్ తో కార్యకర్తలలో జోష్ తెస్తూ , కమిట్మెంట్ తో కూడుకున్న భరోసాను ఇచ్చే వ్యక్తిగా మారారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అలా సరదాగా కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ సంభాషించడం అనే విషయంపై వైసీపీ కార్యకర్తలు అలాగే ప్రజలందరూ కూడా శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
