Monday, 16 March 2026
Swasthik News
Home / రాజకీయం

తిరుమల లడ్డు విషయంలో కూటమి పై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్

31 Jan 2026
07:40 PM
44

యర్రగొండపాలెం :- ఈరోజు మీడియా సమావేశంలో భాగంగా ఏదైతే తిరుమల లడ్డు  విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టిస్తుందో   దానిపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యానిస్తూ కూటమిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. జంతువులు,పంది, చేప పదార్థాలు నెయ్యిలో కలవలేదు అన్నా కూడా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తుంది అని అన్నారు. మీరు చేసే ఆరోపణల్లో సాక్షాలు ఏవి? మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి శాంపిల్ తీసిన నెయ్యి మీరు కలుషితమౌతుంది అంటే మీ తప్పు కాదా?.. అని ప్రశ్నించారు. కొనుగోలు కమిటీలో టీటీడీ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కొలుసు పార్థసారథి  ఈరోజు మీ కేబినెట్ లో మీ పార్టీలో ఉన్నారు కదా తప్పు జరిగి ఉంటే వారిపై చర్యలేవి..? అని నిలదీశారు. నెయ్యి సప్లై చేసిన కంపెనీ భోలే బాబా మీరు 2018లో అనుమతి ఇచ్చిన కంపెనీ కదా మీ హయాంలో సప్లై చేసిన మొత్తం నెయ్యి కలుషితమని మీరు ఒప్పుకుంటున్నారా..? అని అన్నారు. 

Article Image

మా ప్రభుత్వంలో తిరుమల లడ్డు పవిత్రంగా ఉందని.. మా ప్రభుత్వం లో సరఫరా అయిన నెయ్యి శాంపిల్ తీసుకున్నారా..చెక్ చేశారా అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒంగోలు లోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు.మీరు తప్పు చేసి నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారన్నారు.వైయస్ఆర్సీపీపై కక్షగట్టి నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. చిన్న అప్పన్న తప్పు చేస్తే..అతను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పీఏ కదా..అంటే ముడుపులు ఆమెకు అందాయేమో విచారించారా అని అన్నారుపథకాలు ఇస్తామని ప్రజలను మోసం చేసినట్టు.. దేవుడిని కూడా మోసం చేయాలని అనుకుంటున్నారన్నారు.వైవీ సుబ్బారెడ్డి కుటుంబం నిత్యం భక్తి లో ఉండే కుటుంబం అని..చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజా సేవ లేదన్నారు. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో కూటమి నేతలు తప్పుడు పోస్టర్ లు, ఫ్లెక్సీ లు వేస్తున్నారన్నారు. హిందువులను రెచ్చగొట్టేలా కూటిమి చర్యలు ఉన్నాయని.. హిందువులను రెచ్చగొట్టి వైయస్ఆర్సీపీకి దూరం చేయాలని కుట్ర పన్నారన్నారు. అందుకే ఇవ్వాల కూటమి చేసిన పాపం ప్రక్షాళన చేయమని వెంకటేశ్వర స్వామి గుడివద్ద రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వైయస్ఆర్సీపీ ఇంచార్జ్ శ్రీ చుండూరి రవి, స్టేట్ సెక్రటరీ లు రమణారెడ్డి, వెంకటేశ్వర్లు  మరియు ఒంగోలు నాయకులు పాల్గొన్నారు.

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!