స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- రెండు తెలుగు రాష్ట్రాలలో హిందూ ధర్మం, జీవిణ శైలి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానూ అలాగే పాటించే విధంగా చేస్తున్నటువంటి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తాజాగా జీవితంలో స్థిరపడడం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో డబ్బులు సంపాదిస్తే సెటిల్ అయినట్టు కాదు అని వివరించారు. ఈ మధ్యకాలంలో ఏ పెళ్లి సంబంధానికి వెళ్ళినా కూడా అబ్బాయి సెటిల్ అయ్యాడా లేదా అని ముక్కు సూటిగా అడిగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సెటిల్ అవ్వడం అంటే ఏంటో అనే దాని గురించి గరికపాటి నరసింహారావు పూర్తిగా వివరించారు.

స్థిరపడడం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. మావాడు విదేశాలకు వెళ్ళాడు.. అక్కడ బాగా సెటిల్ అయ్యాడు అని చాలామంది అంటుంటారు. కానీ అది సెటిల్ అవడం కాదు అని.. నిజంగా స్థిరపడడం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకొని జీవితాంతం నిలబడగలిగే వ్యక్తి నిజంగా స్థిరపడినట్లు లెక్క అని అన్నారు. కేవలం డబ్బులతో మాత్రమే ఎవడు కూడా సెటిల్ అవ్వడు అని చెప్పుకొచ్చారు.