స్వస్తిక్ న్యూస్, క్రీడలు :- ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు అద్భుతమైన బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ఛేదించింది.ముంబై బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 78 పరుగులు (38 బంతులు), రికెల్టన్ 81 పరుగులు (43 బంతులు) చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 13 ఓవర్లలో 100కి పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పారు.చివర్లో సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు (8 బంతులు), తిలక్ వర్మ 20 పరుగులు (14 బంతులు), హార్దిక్ పాండ్యా 18 పరుగులు (11 బంతులు) చేసి జట్టును విజయానికి చేర్చారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో కీలక స్థానాన్ని సంపాదించింది. గత 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్లు ఓడిపోతే వస్తుంది. కానీ ఈరోజు మాత్రం మొదటి మ్యాచ్ లోనికి వరస్ట్ రికార్డును సొంతగా బ్రేక్ చేసేసింది. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా ఈసారి కప్పు ముంబై ఇండియన్స్ దే అని ధీమా వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.