స్వస్తిక్ న్యూస్, త్రిపురాంతకం :- ఈ నెల 27, 28 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘డిజిటల్ మహానాడు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు త్రిపురాంతకం మండలంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్లస్టర్-07 పరిధిలోని స్థానిక ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటు చేయనున్న మహానాడు వేదికను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు స్వయంగా పరిశీలించారు.వేదిక వద్ద జరుగుతున్న పనులను, డిజిటల్ ప్రసారాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన నిశితంగా పరిశీలించి, పలు సూచనలు చేశారు.

మండల నాయకులతో సమీక్షా సమావేశం :- ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు గారు మండల స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కలిసి ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ, వేదిక వద్ద కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, మరియు హాజరయ్యే శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి డిజిటల్ మహానాడును గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. క్లస్టర్-07 పరిధిలోని ప్రతి కార్యకర్త మరియు నాయకుడు క్రియాశీలకంగా వ్యవహరించి ఈ డిజిటల్ వేదిక ద్వారా పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.