స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :-యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఏరిక్సన్ బాబు గారి ఆదేశాల మేరకు పుల్లలచెరువు క్లస్టర్-4 పరిధిలోని నాయుడుపాలెం కొత్తూరు గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మండల స్థాయి నాయకులు, గ్రామ నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా హాజరయ్యారు. మహానాడులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. నెల్లూరు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా కనిపించారు.