NAMPALLY COURT :- హైదరాబాదులోని ఫిలింనగర్ లో ఉన్నటువంటి "దక్కన్ కిచెన్" హోటల్ ను కూల్చివేసిన వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖ హీరోలు, దగ్గుపాటి సోదరులు విక్టరీ వెంకటేష్, రానా మరియు సురేష్ బాబుకు చిక్కు ఎదురైంది. నందకుమార్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చినటువంటి స్థలంలో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ ను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా ఎలా కూల్చివేస్తారు?.. అని నాంపల్లి కోర్టు విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రానా, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పదేపదే తిరస్కరించడంపై తాజాగా న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. సెలబ్రిటీలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం ఉంటుందా..? అంటూ ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అంటూ.. ఫిబ్రవరి 5వ తేదీన నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలి అని నాంపల్లి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆరోజు కూడా హాజరు కాకపోతే వారిపై నాన్ వెలబుల్ వారెంట్ జారీ చేస్తాము అని న్యాయస్థానం కీలక హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ ఘటన సదురు దగ్గుపాటి ఫ్యామిలీకి అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిగా మార్చింది.
