Monday, 16 March 2026
Swasthik News
Home / తెలంగాణ

వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త విధానం

13 Mar 2026
06:12 PM
195

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- నేటి నుంచి వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుంది మరియు ఫిజికల్ పేపర్లు స్వీకరించబడవు అని రవాణాశాఖ స్పష్టం చేసింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన 7 రోజుల్లోపు డీలర్లు వాహన యజమాని మరియు ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్-20తో పాటు అవసరమైన ఇతర పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అధికారులు ఆ పత్రాలను రెండు పని దినాల్లో ఆమోదించాలని ఆదేశాలు జారీ చేయగా, నకిలీ పత్రాలు సమర్పించినట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ హెచ్చరించింది. 

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!