ఆంధ్రప్రదేశ్ :- ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది యువత నాశనం అయిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. ముఖ్యంగా 16 ఏళ్లలోపు వయసు ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఈ సోషల్ మీడియాకు బాగా అలవాటైపోయారు. తినాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా.. ఇలా ఏ పనైనా సరే ఈ సోషల్ మీడియా వీడియోస్ చూస్తూ పనిచేయలేకపోతున్నారు. అయితే తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఆప్స్ వాడకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం లాగానే ఏపీలో కూడా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండే విధంగా దానిని నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా బ్యాన్ నమూనాను కూడా అధ్యయనం చేస్తున్నట్లుగా దావోస్ లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం అలాగే భద్రతను దృష్టిలో ఉంచుకొని వారిని సోషల్ మీడియా ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు లోకేష్ తెలిపారు.
Read Also :-
https://swasthiknews.com/news/megastar-chiranjeevi-sasirekha-song-release-830