ఎర్రగొండపాలెం :- రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం సారథి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అన్న దానం నిర్వహించారు.

