మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో వెలిసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు డిఎస్పీ దంపతులకు స్వామివారి ఆశీర్వచనాలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై బ్రహ్మనాయుడు ఆలయ ధర్మకర్త విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.