Monday, 16 March 2026
Swasthik News
Home / భక్తి వార్తలు

జగదాంబ అమ్మవారి వార్షికోత్సవం

06 Feb 2026
07:01 PM
13

మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలసిన జగదంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 108 మంది మహిళా భక్తులతో లలిత సహస్రనామ పారాయణం అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ అమ్మవారికి పంచామృత అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేసినట్లు వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో ఈవో చెన్నకేశవరెడ్డి, అర్చకులు వరుణ్ తేజ్ శర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

M

M. Adinarayana

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!