ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మరియు నూతన స్వర్ణ గ్రామం కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు, మ్యారి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సొంత ఫోటోలతో పాస్ పుస్తకాలను పంపిణీ చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రీ సర్వే చేయించిన రైతులకు రాజముద్రతో పట్టాదారు
పాస్ పుస్తకాలను అందజేస్తున్నామన్నారు.