Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / రాజకీయం

ఇంటి నుంచే "లంచ్ బాక్స్" తో సచివాలయానికి తమిళ సీఎం! జోసెప్ విజయ్ మార్క్ పాలన

16 May 2026
04:47 PM
23

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- తమిళనాడు రాజకీయాల్లో చారిత్రిక విజయం సాధించి ద్రవిడ కోటపై జెండా పాతిన నటుడు ముఖ్యమంత్రి సి.జోసెప్ విజయ్ పాలనలోను తన మార్క్ విలక్షతను చాటుకుంటున్నాడు. ముక్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుండి అయన చూపిస్తున్న క్రమ శిక్షణ , సమయపాలన అధికార వర్గాలనే కాదు దేశవ్యాప్త రాజకీయ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గా అన్ని అధికారాలు ఉన్నప్పటికీ హడావుడి లేకుండా ఓ సాదారణ ప్రభుత్వ ఉద్యోగి లాగా ప్రతి రోజు విధులకు హాజరవుతున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తమిళ రాష్ట్ర సచివాలయంలో కొత్త వేగాన్ని తెచ్చింది. ప్రతిరోజూ పావుగంట ముందే సచివాలయంలోని తన చాంబర్ వస్తున్నారు. వీవీఐపీ లంచ్ ప్రోటోకాల్స్‌కు స్వస్తి పలికి, ప్రతిరోజూ తన ఇంటి నుంచే స్వయంగా 'లంచ్ బాక్స్' తెచ్చుకుంటూ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం విరామ సమయంలో బయటకు వెళ్ళకుండా , తన చాంబర్ లోనే భోజనం చేసి వెంటనే తిరిగి ఫైళ్ల పరిశీలన చేస్తున్నారు. కేవలం సమయ పాలనకె పరిమితం  కాకుండా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం , ఎన్నికల హామీల అమలుకు అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చటం పై ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీఐపీ కల్చర్‌ను  బ్రేక్ చేసి రోడ్లపై  ట్రాఫిక్ జామ్స్ లేకుండా  ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం చెన్నై నగర సామాన్య ప్రజల నుంచి జేజేలు అందుకుంటోంది.


Swasthik News

Share this Article

S

Subbu

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates