Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటి సర్వేకు ఎన్నికల సంఘం సిద్ధం

17 May 2026
02:23 PM
28

స్వస్తిక్ న్యూస్ , ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల జాబితా  ప్రత్యెక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి అర్హుడైన పౌరుడిని ఓటరుగా నమోదుచేయడం , డబుల్ ఓట్లను తొలగించడం , మరణించిన వారి పేర్లను తొలగించడం లక్ష్యంగా ఇంటింటి సర్వే నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. జూన్ 15 నుంచి ఈ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం నిర్వహించే ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియలో BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తారు. ప్రతి ఓటరుకు ప్రత్యేక ఫారం అందజేసి అందులోని వివరాలు సరిచూసుకోవాలని సూచిస్తారు. కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, తప్పుల సవరణ, వంటి పనులు జరుగుతాయి.

డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి

ఎన్నికల సంఘం ఈసారి ఫేక్ మరియు డూప్లికేట్ ఓట్లను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే విచారణ జరిపి ఒకటి తొలగించనున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

ఓటర్లు సిద్ధంగా ఉంచాల్సిన వివరాలు

EPIC నంబర్ ప్రస్తుత చిరునామా, పుట్టిన తేదీ , ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్ ,కుటుంబ సభ్యుల వివరాలు , తాజా పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో

Swasthik News

Share this Article

S

Subbu

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates