స్వస్తిక్ న్యూస్ , ఆంధ్ర ప్రదేశ్ :- విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు. తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటూ డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశమైన స్టాలిన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అంచనాలను వివరించారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో టీవీ కేకు 107 దాని మిత్రపక్షమైనా కాంగ్రెస్కు 5 సీట్లు ఉన్నాయి. డీఎంకే మిత్ర పక్షాలైన వి సి కె, సిపిఐ, సిపిఎం, ఐయూఎంఎల్ లకు కలిపి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు బయట నుండి ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. గతవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది అన్నా డిఎంకె రెబల్ ఎమ్మెల్యేల మద్దతు కూడా విజయ్ ప్రభుత్వానికి ఉంది. అయితే ఈ సమీకరణాలు ఎంతకాలం నిలుస్తాయి అనే దానిపై డీఎంకే వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. బయట నుండి మద్దతు ఇస్తున్న పార్టీలు వైదొలగిన రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా కోర్టు అనర్హత వేటు వేసిన విజయ్ ప్రభుత్వానికి రాజకీయ అస్థిరత తప్పదని డీఎంకే భావిస్తుంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఓటమి తాత్కాలికమే ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు సిద్ధంగా ఉండండి 2029 లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. మనం తిరిగి పుంజుకొని మళ్లీ గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని, కొలతూరులో తన ఓటమిని కూడా అంగీకరిస్తున్నారని ఆయన తెలిపారు. తమిళనాడులో సూర్యుడు అస్తమించడు అని ఆయన వ్యాఖ్యానించారు. డీఎంకే గుర్తు సూర్యుడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించేందుకు 36 మంది సభ్యులతో ఒక కమిటీని కూడా స్టాలిన్ ఏర్పాటు చేశాడు. అలాగే సోషల్ మీడియాలో పార్టీ ఉనికిని పెంచుకోవడానికి ఒకప్పుడు టీ కొట్టులో చర్చించిన రాజకీయాలను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. అయితే స్టాలిన్ వ్యాఖ్యలని టీవీ కే ప్రభుత్వం కొట్టి పడేసింది. తమ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగేందుకు సరిపడా సంఖ్యాబలం తమకు ఉన్నదని రాజకీయ అస్థిరతకు అవకాశం లేదని ఆ పార్టీ తెలిపింది. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత తమిళనాడు రాజకీయాలపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.