స్వస్తిక్ న్యూస్, తెలంగాణ: - కాపాడాల్సిన వాడే కసాయి వాడితో కాపురం చేయమంటే ఇది ప్రజాస్వామ్యమా లేక రాక్షస రాజ్యమా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన క్యాబినెట్ మంత్రి (పొన్నం ప్రభాకర్)అంతకంటే దిగజారి మాట్లాడటం చాలా దారుణం. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే కుల సంఘాలను కూర్చోబెట్టి ఆ మృగాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయమంటారా ఇది గల్లీలో జరిగిన చిన్న గొడవ కాదు మంత్రిగారు ఇది ఫోక్సో కేసు ఇందులో రాజి అనే మాటకు తావే లేదు. అయినా ఫోక్సు కేసు అంటేనే బాధితురాలు మైనర్ అని అర్థం. ఒక మైనర్ బాలికకు పెళ్లి చేయమని సలహా ఇవ్వటం బాల్య వివాహ నిషేధిత చట్టాల ప్రకారం నేరం. మీరు నేరం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కులం ఒకటే అయితే రేప్ చేసిన మర్డర్ చేసిన మాఫీ అయిపోతుందా ఇంకెందుకు ఈ కోర్టులు , పోలీసు వ్యవస్థలు మంత్రి స్థానంలో ఉన్నవారు చట్టం తన పని తాను చేసుకు పోతుందని బాధితురాలికి అండగా ఉంటామని భరోసా ఇవ్వాల్సింది పోయి అంతేకానీ కుల సంఘాల పెద్దలు కూర్చుని పంచాయతీలు చేసుకోమని చెప్పటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే నేరం చేసిన వాడు ఏ కులమైనా సరే వాడు నేరస్థుడే వాడు జైలుకు పోవాలి కాని పెళ్లి పీటలు ఎక్కకూడదు.