ఎర్రగొండపాలెం :- మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాలలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారుల సమావేశం లో పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనుకున్నట్టుగానే గడువులోపు ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు , మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి , ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ , మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పోలా శ్రీనివాసులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

