AP POLITICS:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయా పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రస్థానంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు అలాగే దాడులు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరిగిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఈ విషయంపై వైసీపీ పార్టీ నాయకులు సీరియస్గా ముందడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో చర్యకు ప్రతి చర్యలు ఉంటాయి అని ఇప్పటికే సీఎం జగన్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే ఇతర నాయకులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు మరింత ఉధృతంగా కాకుండా ఉండడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం రోజున జరిగినటువంటి రెండు గంటల సుదీర్ఘ భేటీలో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కుట్రలు చేస్తుంది అని.. రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతుంది అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీల నేతలు మరియు కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి అని సూచించారు.

ముఖ్యంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీల నేతలు అలాగే కార్యకర్తలు ఎవరు కూడా తొందరపడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు అని సీఎం మరియు డిప్యూటీ సీఎం సూచించారు. చిన్న పొరపాట్లు ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతాయి అని... అది రాష్ట్ర ప్రయోజనాలకు విగాథం కలిగిస్తుంది అని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. కూటమి ప్రభుత్వం కేవలం సంయమనం తో వ్యవహరిస్తూ అభివృద్ధి అలాగే పరిపాలనపై దృష్టి పెడుతుంది అని.. మీరు కూడా ఇదే తీరును పాటించాలి అని అన్నారు.
స్వస్తిక్ న్యూస్.. మరిన్ని రాజకీయ కథనాలతో మీ ముందుకు వస్తాం 👍🔥....