స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయ:-ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి పట్ల సంతాపం తెలిపేందుకు అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి పోటెత్తడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను భావించానని, కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ సెటైర్లు ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న జనసందోహాన్ని ఉద్దేశించి ట్రంప్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ప్రస్తుతం ఇరాన్ ప్రజలందరూ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో గుమిగూడి ఉన్నారు. కేవలం ఒకే ఒక్క దాడితో వారందరినీ పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చు (లేపేయొచ్చు). కానీ, మనం ఆ పని చేయబోవడం లేదు. ఎందుకంటే, ఒకవేళ అలా చేస్తే మనతో చర్చలు జరిపేందుకు అక్కడ ఇంకెవరూ మిగలరు కదా!" అని ట్రంప్ సెటైర్లు వేశారు.ప్రస్తుతం ఇరాన్ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.