స్వస్తిక్ న్యూస్,హైదరాబాద్ :- చదువు అనేది ఒక చిన్నారి జీవితాన్ని మాత్రమే కాకుండా, ఆ కుటుంబ భవిష్యత్తును కూడా మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం. కానీ నేటికీ సమాజంలో వేలమంది చిన్నారులు బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకోవాల్సిన పసి ప్రాయంలోనే హోటళ్లు, ఇటుక బట్టీలు, కర్మాగారాల్లో బాలకార్మికులుగా మారి శ్రమిస్తున్నారు.
ఉచిత విద్య, వసతులపై అవగాహన కల్పించాలి..! నిరుపేద చిన్నారులకు ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత విద్య, మధ్యాహ్న భోజన పథకం మరియు ఇతర ఉచిత వసతులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. వారిని బడి వైపు నడిపించేందుకు సమాజం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కి సమాచారమివ్వండి..!
సమాజంలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 లేదా స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించాలని సామాజిక విశ్లేషకులు కోరుతున్నారు. మనం తీసుకునే ఒక చిన్న చొరవ, చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్ ఎంతోమంది అమాయక పిల్లల మరియు వారి కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపగలదు.