స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు :- పుల్లలచెరువు మండలం, మల్లపాలెం గ్రామంలో ఈరోజు ఎంపీడీఓ మరియదాస్ పర్యటించారు. ఇవాళ ఉదయం మల్లపాలెం గ్రామం సందర్శించి "డోర్ టు డోర్ గార్బేజ్" కలెక్షన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఇంటి పన్ను వసూలు కార్యక్రమం లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటుగా పంచాయతీ సెక్రటరీ వెంకటరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలుు పాల్గొన్నారు.
