స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు:- పీ ఎం శ్రీ పాఠశాల విద్యార్థులు విహారయాత్రలతో విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం లభించిందని పుల్లలచెరువు జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ ప్రభూజీ అన్నారు. గురువారం ఆ పాఠశాల విద్యార్థులు మార్కాపురంలోని శామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలను,అందులోని సౌకర్యలను, శాఖా గ్రంధాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పలు విజ్ఞాన పుస్తకాలు చదువుకుని పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ విజ్ఞాన యాత్రలతో విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు, మల్లికార్జున, రామాంజీ తదితరులు సూచించారు. ఉల్లాసంగా విద్యార్థులు విజ్ఞాన యాత్రలో పాల్గొన్నట్లు వారు తెలిపారు.
