SPORTS UPDATES :- మరో వారం రోజులలో జరగబోయేటువంటి పురుషుల T20 వరల్డ్ కప్ కు ముందే ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. T20 ప్రపంచ కప్ గురించి వివిధ దేశాలు వివిధ రకాలుగా మాట్లాడుతూ వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచులు భారతదేశంలో జరుగుతుండడంతో భద్రతా లేమి కారణంగా మేము ఆడలేము అంటూ తేల్చి చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ టి20 ప్రపంచ కప్ ను బాయ్కాట్ చేస్తాము అంటూ ఎన్నో సందర్భాల్లో బెదిరించింది. అయితే తాజాగా ఈ విషయంపై భారత క్రికెటర్ అజింక్య రహనే స్పందిస్తూ పాకిస్తాన్ దేశంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దేశానికి టి20 ప్రపంచ కప్ ను ఆపే దమ్ము లేదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు పాకిస్తాన్ అలా చేయదు అని డైరెక్ట్ గా చెప్పేసారు. మరోవైపు ఇప్పటికే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు శ్రీలంకలోని కొలంబోకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. "టెలికం ఆసియా స్పోర్ట్" పాకిస్థాన్ జట్టు కొలంబో వెళ్తుంది అని.. ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లుగా ప్రకటించింది. బంగ్లాదేశ్ వరల్డ్ కప్ కు దూరం అవడంతో ఆ దేశానికి మద్దతుగా మేము కూడా నిలుస్తూ బాయ్కాట్ చేస్తాము అని.. ఈ విషయంపై పునరాలోచిస్తాము అని పాకిస్తాన్ చెప్పింది. ఈ విషయంపై సోమవారం రోజున ఒక క్లారిటీ అయితే ఇస్తాము అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వి అన్నారు. కానీ పాకిస్తాన్ కు అంత సీన్ లేదు అని ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక గత టి20 వరల్డ్ కప్ ను భారత జట్టు కైవశం చేసుకున్న విషయం తెలిసిందే.
