స్వస్తిక్ న్యూస్, జాతీయం :- ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలను కష్టపెట్టకుండా చదివించి పెంచి పోషించాలి అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు వారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరి కష్టపడుతున్నారు అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. డబ్బులు సంపాదించడం కోసం మనం ఎన్నో రకాలుగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాము అని తెలిపారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క పురుషుడు తమ భార్యాబిడ్డలను సంతోషంగా ఉంచాలనే ఆరాటంలో అసలు తను సంతోషంగా ఉన్నాడా అని కూడా ఆలోచించట్లేదు అని అన్నారు. ప్రతి మనిషి సరైన తిండి, ప్రశాంతమైన నిద్రపోలేనప్పుడు ఎంత సంపాదించినా కూడా వృధానే అని.. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి అని తెలిపారు. మనిషిలో అత్యాశ ఉన్నంతకాలం సరైన జీవితాన్ని గడపలేరు అని... ఎవరైతే అత్యాశలు వదిలి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తారో వారే పూర్తి ఆరోగ్యంతో ఉంటారు అని స్పష్టం చేశారు. మనశ్శాంతినే నిజమైన సంపద అని ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు వివరించారు.
