»పేదల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భావం.
»పుల్లలచెరువులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
పుల్లలచెరువు మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షులు పొట్లగోవిందు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి కాకర్ల కోటయ్య,మాజీ మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు మేడికొండ లక్ష్మి నారాయణ, టిడిపి సీనియర్ నాయకులు గజ్వల్లీ భాస్కరరావు, ఎంపీటీసీ మేడికొండ రాధాకృష్ణ, మండల ఉపాధ్యక్షులు కాయకోకుల ఇదమ్మ, పుల్లలచెరువు పట్టణ అధ్యక్షులు మేడికొండ అనిల్ కుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పల్లపాటి బాదరయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు కేసనపల్లి బక్కయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.