Monday, 16 March 2026
Swasthik News
Home / సినిమా

డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసిన రాంచరణ్ కొణిదెల

03 Mar 2026
07:21 PM
4,265

స్వస్తిక్ న్యూస్, సినిమా :-  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి పెద్ది సినిమా పై ప్రతి ఒక్కరు కూడా భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ పెద్ది సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లుగా చిత్ర బృందం ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్ డబ్బింగ్ చెబుతున్నట్లుగా పక్కనే ఉండి బుచ్చిబాబు గమనిస్తున్నట్లుగా వైరల్ అవుతుంది.

Article Image

 ఇక ఈ వీడియో కింద క్యాప్షన్ లో సమ్మర్లో మాసివ్ ట్రీట్ కు రెడీగా ఉండండి అంటూ చిత్ర బృందం ప్రకటించడంతో సినిమాపై భారీగానే ఆశలు పెరిగాయి. కాగా బుచ్చిబాబు డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది అని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ మరియు జగపతిబాబు వంటి కీలక నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లుగా ముందుగానే మూవీ టీం ప్రకటించింది. రామ్ చరణ్ చివరిగా చేసిన సినిమా గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.  కానీ త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి పెద్ధి సినిమాపై ఫ్యాన్స్ అందరూ కూడా భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!