స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయ:- భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మనకు తెలుసు, కానీ ఒక వ్యక్తి ఏకంగా చంద్రుడినే అమ్మకానికి పెట్టి కోట్లు గడిస్తున్నాడు. డెన్నిస్ హోప్ అనే అమెరికన్ రియల్టర్ చంద్రుడిపై ప్లాట్లు అమ్ముతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
నేపథ్యం:- 1980వ దశకంలో అంతర్జాతీయ అంతరిక్ష చట్టాలలోని కొన్ని లొసుగులను డెన్నిస్ హోప్ కనిపెట్టారు. 1967 నాటి 'ఔటర్ స్పేస్ ట్రీటీ' ప్రకారం ఏ దేశమూ అంతరిక్షంలోని గ్రహాలపై యాజమాన్య హక్కులు కలిగి ఉండకూడదు. అయితే, ఇందులో వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదని గుర్తించిన హోప్, చంద్రుడిని తన ఆస్తిగా ప్రకటించుకున్నారు.
వ్యాపార విశేషాలు:- ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మందికి పైగా ప్రజలు ఈయన వద్ద చంద్రుడిపై స్థలాలను కొనుగోలు చేశారు.
ఆదాయం:- ఈ ప్లాట్ల విక్రయాల ద్వారా ఆయన ఇప్పటికే ₹100 కోట్లకు పైగా సంపాదించినట్లు సమాచారం.పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు సైతం ఇక్కడ ఎకరాల కొద్దీ భూమిని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చట్టబద్ధతపై సందేహాలు:- ఈ 'మూన్ రియల్ ఎస్టేట్' వ్యవహారానికి ఎటువంటి అంతర్జాతీయ చట్టబద్ధత లేకపోయినప్పటికీ, ఆర్టెమిస్-2 వంటి ప్రయోగాలు జరుగుతున్న వేళ ఈ వార్త మరోసారి వైరల్ అవుతోంది. చంద్రుడిపై ప్లాట్లు కొనడం అనేది కేవలం ఒక ఫ్యాషన్ లేదా వింత కోరికగా మిగిలిపోతుందా లేక భవిష్యత్తులో ఏదైనా విలువ ఉంటుందా అనేది వేచి చూడాలి.