స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయ:-
వాషింగ్టన్: ఖగోళ ప్రపంచంలో గత రెండు దశాబ్దాలుగా చర్చనీయాంశంగా మారిన ప్లూటో (Pluto) గ్రహం హోదాపై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఒక 10 ఏళ్ల చిన్నారి రాసిన లేఖ ఇప్పుడు నాసా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది.
వార్త వివరాల్లోకి వెళ్తే:- ప్లూటోను తిరిగి గ్రహాల జాబితాలో చేర్చాలంటూ కేలా (Kaela) అనే 10 ఏళ్ల బాలిక నాసాకు ఒక భావోద్వేగపూరితమైన లేఖ రాసింది. "ప్లూటో ఒక మరుగుజ్జు గ్రహం మాత్రమే కాదు, దానికి పూర్తిస్థాయి గ్రహం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని ఆమె తన లేఖలో పేర్కొంది.సాధారణంగా ఇలాంటి అభ్యర్థనలు వస్తుంటాయి, కానీ ఈసారి నాసా అడ్మినిస్ట్రేటర్ స్వయంగా స్పందించడం విశేషం.
నాసా స్పందన:
బాలిక లేఖపై నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ సానుకూలంగా స్పందించారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ..."కేలా - మేము దీని గురించి ఆలోచిస్తున్నాము (We are looking into this)," అని సమాధానం ఇచ్చారు.
నేపథ్యం:-
1930: ప్లూటోను సౌర కుటుంబంలో తొమ్మిదవ గ్రహంగా గుర్తించారు.
2006: అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) గ్రహాలకు ఉండాల్సిన కొత్త నిబంధనలను రూపొందించింది. దీనివల్ల ప్లూటో తన గ్రహం హోదాను కోల్పోయి 'మరుగుజ్జు గ్రహం' (Dwarf Planet) గా మిగిలిపోయింది.
ప్రస్తుతం:- నాసా చీఫ్ తాజా వ్యాఖ్యలతో, ప్లూటోకు మళ్ళీ పూర్వవైభవం వస్తుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.కేలా చూపిన చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒక చిన్నారి