Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "ప్రజా దర్బార్" కార్యక్రమం

14 Feb 2026
03:45 PM
287

స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :-యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా దర్బార్" కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు.

Article Image

ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  రేపు మహాశివరాత్రి సందర్భంలోనూ.. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Article Image

ఇక ఇప్పటికే మహాశివరాత్రి ఏర్పాట్లను పూర్తి చేసామని.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొండపైకి నూతన రహదారిని కూడా నిర్మించాము అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు ,మండల టీడీపీ కన్వీనర్ చిట్యాల వెంగళరెడ్డి , శనగ నారాయణరెడ్డి మండల టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!