స్వస్తిక్ న్యూస్,జాతీయం :- ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆరోజు ప్రేమికులు ఎక్కడ కనిపించినా వారి ఎముకలు విరిచేస్తాము అని తాజాగా "క్రాంతి సేన" వార్నింగ్ ఇచ్చింది. ప్రేమికుల దినోత్సవం ముంగిట ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ లోని క్రాంతి సేన తీవ్రంగా హెచ్చరిక చేసింది. వాలెంటైన్స్ డే స్పెషల్ అంటూ ఆరోజు ప్రేమ జంటలు అనుమానస్పద స్థితిలో కనిపిస్తే వారి ఎముకలు ఇరగగొడతాం అంటూ తాజాగా లాఠీలకు నూనె రాస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హెచ్చరించారు.

రోజ్ డే, చాక్లెట్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే వంటి అన్నీ వేడుకలు విదేశీ సంస్కృతి నుంచి వచ్చాయి అని... అవి మన దేశంలో చేయడానికి వీలు లేదు అని వీరు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14వ తేదీన లవర్స్ డే అంటూ అనుమానాధస్పద స్థితిలో ఎవరైనా సరే జంటగా కనిపిస్తే వారితో పాటుగా హోటల్స్ మరియు రెస్టారెంట్ యాజమాన్యాలపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాము అని పలు ప్రదేశాలలో లేఖలు పంచారు.

దీంతో ప్రేమ జంటల నుంచి సోషల్ మీడియా వేదికగా వీరిపై చాలానే అసభ్యకర కామెంట్లు వస్తూ ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం నాడు సెలబ్రేట్ చేసుకోవడం లో తప్పేముంది అంటూ తిరిగి వారిపైనే మండిపడుతున్నారు. ఏది ఏమైనా కూడా వీళ్లు ఇలా చెప్పడంతో దేశవ్యాప్తంగా ప్రేమికులు అందరూ కూడా వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పబ్లిక్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇలాంటి చర్యలు చేపడుతున్నందుకు వీరికి కొంతమంది మద్దతుగా కూడా నిలుస్తున్నారు.