Monday, 16 March 2026
Swasthik News
Home / అంతర్జాతీయ వార్తలు

10 కోట్ల మంది ఫాలోవర్స్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఆల్ టైమ్ రికార్డ్

26 Feb 2026
03:39 PM
1,321

స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయం :-  మన దేశ ప్రధానమంత్రి "నరేంద్ర మోడీ" ప్రపంచ దేశాల్లో ఎంత పాపులారిటీ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేరు గడించింది అంటే దానికి ప్రధాన కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పవచ్చు. ఈరోజు భారతదేశం గురించి ప్రపంచ దేశాలు చెప్పుకుంటున్నాయి అంటే దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ. ప్రతిరోజు ఏదో ఒక రికార్డు సృష్టించే నరేంద్ర మోదీ నేడు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో 10 కోట్ల మంది ఫాలోవర్స్ తో తొలి వరల్డ్ లీడర్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Article Image

ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన మంత్రులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో రికార్డు సృష్టించారు. 10 కోట్ల మంది ఫాలోవర్స్ తో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉండగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 4.3 కోట్ల మంది ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో నిలిచారు. ఇక మూడవ స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియం 1.5 కోట్ల మంది ఫాలోవర్స్ తో నిలిచారు. ఆ తరువాత బ్రెజిల్ అధ్యక్షుడు లూలా 1. 44 కోట్ల మంది ఫాలోవర్స్ తో నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోడీకి రెట్టింపు కంటే ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉండడం చాలా విశేషంగా అనిపిస్తుంది. ప్రపంచ దేశాలు నేడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తున్నాయి.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!