Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

డిజిటల్ మహానాడుకు ముస్తాబవుతున్న పుల్లలచెరువు: ఏర్పాట్లను పరిశీలించిన గూడూరి ఎరిక్షన్ బాబు

25 May 2026
01:47 PM
809

స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- ఈ నెల 27, 28 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న 'డిజిటల్ మహానాడు' కార్యక్రమానికి పుల్లలచెరువు మండలంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్లస్టర్-04 పరిధిలోని పిడికిటివారిపల్లె గ్రామ పరిసరాల్లో ఉన్న నాయుడుపాలెం (కొత్తూరు) శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ నందు ఈ మహానాడు వేదికను ఏర్పాటు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇన్‌ఛార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు సోమవారం మహానాడు వేదికను స్వయంగా సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Article Image

నాయకులతో సమీక్ష:- వేదిక పరిశీలన అనంతరం ఆయన మండల పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ, సభా ప్రాంగణంలో కల్పించాల్సిన సౌకర్యాలు, డిజిటల్ నెట్‌వర్క్ ఏర్పాట్లు మరియు భోజన వసతులపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు  మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అత్యంత కీలకమైన డిజిటల్ మహానాడును మండలంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల టీడీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates