స్వస్తిక్ న్యూస్ ,పుల్లలచెరువు:- పుల్లలచెరువు మండల ఎంపిడిఓ M. మరియదాసు ఈరోజు మండలంలోని మల్లపాలెం గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేసారు. సచివాలయం పరిధిలో జరిగే సర్వేల గురించి సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతి కోసం సిబ్బంది తో పాటు ఫీల్డ్ లో తిరిగారు.అలాగే రోజువారి కార్యక్రమమైన పంచాయతీ పరిధిలో జరిగే శానిటేషన్ పనుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నూతనంగా నిర్మించిన క్యాటిల్ షెడ్ లను పరిశీలించారు.

వయోజన విద్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం గురించి ప్రజలలో అవగాహన కల్పించారు. ఇంటి పన్ను వసూలు ఆన్లైన్ చేసినందున ఇంటి పన్ను చెల్లింపు ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ గారితో పాటు స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్, పంచాయతీ కార్యదర్శి వెంకటరామిరెడ్డి, సచ్చివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
