పుల్లలచెరువులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
(స్వస్తిక్, న్యూస్, పుల్లలచెరువు:-)
పుల్లలచెరువు మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల జనసేన అధ్యక్షులు కొటారి. అచ్చయ్య సీనియర్ నాయకులు ఆకుల. వెంకటేశ్వర్లు, పసుపులేటి. బుజ్జి తదితరుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ప్రధాన సెంటర్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. . అనంతరం జనసేన పార్టీ ఆశయాలను గూర్చి,మండల పరిధిలో చేసిన అభివృద్ధిని గూర్చి ఆయన కొనియాడారు.జనసేన పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూటమి పొత్తు ధర్మానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.