»పుల్లలచెరువులో ఉద్యమంలా జనసేన సభ్యత్వ నమోదు.
»ధీమాగా ఉండేందుకు భీమాతో భరోసానిస్తున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమే.
స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు:-
జనసేన సభ్యత్వ నమోదుతో భీమా సౌకర్యం లభిస్తుందని జనసేన మండల కన్వీనర్ కొఠారి. అచ్చయ్య తెలిపారు. పుల్లలచెరువు మండల కేంద్రంలో గురువారం ఉద్యమంలా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనసేన సభ్యత్వం పొందిన కార్యకర్తలకు భీమా లభిస్తుందన్నారు. సహజ మరణానికి 1 లక్ష, ప్రమాదవ శాత్తు మరణానికి 5 లక్షలు,ఏదైనా ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం తక్షణమే ఆర్ధిక సహాయం పొందే అవకాశం ఉందన్నారు. రుసుము 400 చెల్లించి జనసేన కుటుంబ సభ్యులుగా నమోదు కావాలని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. కార్యకర్తలకు, ప్రజలకు దేశంలోనే భరోసా కల్పిస్తున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమేనన్నారు. సభ్యత్వ నమోదుకు గడువు ఈనెల 10వ తేదీ వరకు మాత్రమే ఉందని అన్నారు.ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.సిద్ది. లక్ష్మయ్య, ఆర్మీ బుజ్జి,పసుపులేటి. బుజ్జి, విష్ణు, శ్రీను, వీరమ్మ, వెంకీ, వెంకటలక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.