స్వస్తిక్ న్యూస్, సినిమా :- గ్లోబల్ స్టార్ ప్రభాస్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టాలీవుడ్ లోని ప్రతి హీరో మేనరిజం మార్చాలన్న.. ప్రతి ఒక్కరిలోని అసలైన మాస్ యాంగిల్ ను బయటకు తీయాలి అన్న ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ను తాజాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ పూర్తిస్థాయిలో ప్రశంసించారు.

సంతోష్ శోబన్ మానస వారణాసి సినిమా కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే పూరి జగన్నాథ్ తో చేసినటువంటి ప్రయాణాన్ని హీరో ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు గురించి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ నాకు బుజ్జిగాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు నిజంగా నా క్యారెక్టర్ పిచ్చెక్కిపోయింది. ఇప్పటివరకు నేను అలాంటి పాత్ర చేయలేదు అని.. ఆ క్యారెక్టర్రైజేషన్ ఇప్పటివరకు కూడా చాలా ప్రభావం చూపుతుందని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజమౌళి కాదు కదా పూరి జగన్నాథ్ లా క్యారెక్టర్ లను డిజైన్ చేసేవారు కేవలం ఇండియాలోనే కాదు బహుశా ప్రపంచంలోనే ఎవరూ ఉండకపోవచ్చు అని ప్రభాస్ అనడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది.

పూరి జగన్నాథ్ కలం నుంచి డైలాగులు జాలువారు తాయి అని ప్రశంసించారు. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు పూరి జగన్నాథ్ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక దర్శకుడు ప్రతిభను ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇంతలా గౌరవించడం అనేది మన టాలీవుడ్ లోనే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ను ప్రశంసిస్తున్నారు.