Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

తెలంగాణలో వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఆ తర్వాత పెరగనున్న ఎండలు!

26 Apr 2026
02:05 PM
90

స్వస్తిక్ న్యూస్:- తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.వర్షాలు కురిసే జిల్లాలు ఇవే ​వాతావరణ శాఖ అంచనా ప్రకారం ప్రధానంగా ఈ క్రింది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

​ఆదిలాబాద్

​ఆసిఫాబాద్

​మంచిర్యాల

​భూపాలపల్లి

​ములుగు

​కొత్తగూడెం

​మెదక్

​కామారెడ్డి

పెరగనున్న ఉష్ణోగ్రతలు:- ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరగనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుందని అధికారులు స్పష్టం చేశారు.హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates