స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారాన్ని అందించారు.
తెలంగాణలో భారీ వర్షాలు:- తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని చెప్పారు.
ఏపీలో మోస్తరు వర్షాలు:- అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయి. ఏపీలోని విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు , నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.